- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దళితులపై దాడులు అమానుషం
దిశ ఖానాపూర్ : రాష్ట్రంలో దళితులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అవి ఆగేంత వరకు దళిత సంఘాల పోరాటం ఆగదని దళిత సంఘాల రాష్ట్ర నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి దసరా ఉత్సవాల సందర్భంగా జెండా గొడవలలో దళితులపై దాడి చేసినందుకు జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మస్కపూర్ గ్రామంలోని ఎల్ ఆర్ పంక్షన్ హాల్లో నిర్వహించిన దళిత ఆత్మగౌరవ పోరాటసభకు ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుండి దళిత సంఘనాయకులు, దళితులు, ఆయా సంఘనాయకులు మద్దతుగా 4000 మందితో ఖానాపూర్ మండల కేంద్రం నుండి పంక్షన్ హల్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు.
పెంబి మండలంలోని మందపెళ్లి దళిత నాయకులు మాట్లాడుతూ గ్రామంలోని అగ్ర కులస్తులు దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని, కులవివక్షణ చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం దళిత సంఘ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. మందపల్లి గ్రామంలో దళితుల పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో దళిత సంఘ న్యాయపోరాటం ఆగదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ దక్షణ భారత దేశ అధ్యక్షుడు వెంజర్ల రాజేష్, కులనిర్ములాన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అభినవ్, ప్రజ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు పేట భాస్కర్, బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి బలసిలాల్, మండల అంబేద్కర్ ప్రధాన కార్యదర్శి మునుగురి నరేందర్, శ్యాం, దాసరి రాజన్న, బొమ్మెన రాకేష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.