- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్పింగ్ పోస్టుల పై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం.. గడ్డం వినోద్
దిశ, బెల్లంపల్లి : బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు సోషల్ మీడియా లో అసభ్యకరంగా వీడియోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ మండిపడ్డారు. ఇవాళ బెల్లంపల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్డం వినోద్ మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన వ్యక్తిగత ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసేందుకు వాట్సప్ గ్రూపులో అసభ్యకర వీడియోలు తయారు చేసి పోస్ట్ చేయించడం సంస్కారం కాదని అన్నారు. మానసికంగా ఇబ్బంది పెట్టేలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మార్ఫింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తుల పై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మార్పింగ్ వీడియోల పోస్టింగ్ కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నైతిక బాధ్యత వహించాల్సిందేనన్నారు. వారి పై చట్టపరమైన చర్యలు కోసం పోరాడుతామన్నారు. ఎన్నికల్లో తమను ఎదుర్కొనే ధైర్యం సత్తాలేక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు నీచమైన పనులకు దిగజారిపోయారని ధ్వజమెత్తారు. దుర్గం చిన్నయ్య ఆకృత్యాలు, ఆయన అనుచరులను బెల్లంపల్లి ప్రజలు ఇక సహించరని తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఇన్చార్జి కేవీ ప్రతాప్, బెల్లంపల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.