- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం
దిశ, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ లో భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం యువ నాయకుడు శ్రీధర్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసి పార్టీలో మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తున్నా ఈటల రాజేందర్ కు సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిపై ఆరోపణలు రుజువు చేయాలని.. లేని పక్షంలో సహించేది లేదని ఆయన అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, సవాలును స్వీకరించకుండా దొంగ లెక్క పారిపోయి తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు.
మళ్లీ ఇలాంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరిమికొడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిన్న రాంరెడ్డి, రేగాళ్ల భూషణ్ శర్మ, పాతర్ల నాగరాజు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర కృష్ణ, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు బొడ్డు రాకేష్, దుర్గం వెంకట స్వామి, తగరం నగరాజ్, గడం సుమన్, నవీన్ ఎండీ.కరీం, సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.