- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశాభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఆవిర్భావం: ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్
దిశ, ఖానాపూర్: దేశాభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలో దాదాపుగా మూడు వేల మంది కార్యకర్తలతో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని కొనియాడారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకునే వారు కాదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు భీమా, రైతు రుణ మాఫీ పథకాలను అమల్లోకి తీసుకోచ్చారని గుర్తు చేశారు.
ప్రతి గ్రామంలో వాడవాడకు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారని ఆమె తెలిపారు. అభివృద్ధిని చూసి ప్రజలే మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతారని అన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమేనని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాథోడ్ రాము నాయక్, జడ్పీటీసీ ఆకుల రాజమణి వెంకగౌడ్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, పుప్పాల శంకర్, ఎంపీపీ అబ్దుల్ మోహీద్, రాజగంగన్న, నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.