- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాటు పడవలలో ప్రయాణం.. భక్తుల ప్రాణాలతో చెలగాటం..
దిశ, బాసర : బాసర గోదావరి ఘాట్ పై నాటు పడవలు భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఎటువంటి లైసెన్సులు, సేఫ్టీ లేకుండా బాసర గోదావరిలో దాదాపు 100కు పైగా నాటు పడవలు నడిపిస్తున్నారు. ఒక్క బొట్లో దాదాపు 30 మందికి పైగా కూర్చోపెట్టి వారి ఒక్కొకరి వద్ద 100 రూపాయలు వసూలు చేసి జేబులు గుళ్ళ చేస్తున్నారు. తాజాగా భక్తుల ఇక్కట్లు దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ శనివారం బాసర గోదావరి ఘాటును సందర్శించి స్థానిక ఎమ్మార్వోకు తగిన సూచనలు ఇచ్చారు. బోట్ నడిపే వాళ్ళు లైఫ్ జాకెట్లు, డబ్బులు వసూలు వ్యవహారం గురించి సూచిక బోర్డు ఏర్పాటు చేసి రిజిస్టర్ కంప్లైంట్ నెంబర్ను అక్కడ పెట్టాలని, భక్తుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే ఆ నెంబర్ కు కంప్లైంట్ చేయవలసిందిగా కలెక్టర్ ఎమ్మార్వోకు బోర్డు ఏర్పాటు చేయమని సూచించారు. అయితే కార్తీక మాసం సందర్భంగా భక్తులు బాసర గోదావరికి వేలాదిగా తరలి వస్తుండడంతో వారి డిమాండ్ మరింత పెరిగింది. భక్తులు గోదావరి పుణ్య జలాన్ని ఇంటికి తీసుకు వెళ్లడానికి బాటిల్లో గంగమ్మ తల్లిని నింపి ఇవ్వడానికి ఒక్కొక్కరి వద్ద దాదాపు 200 రూపాయలు అడుగుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఇష్టారీతిన బోటు నిర్వాహకులు వ్యవహరిస్తూ ఎటువంటి పర్మిషన్ లైసెన్సులు లేకుండా నాటు పడవలకు మిషన్లు అమర్చి అతివేగంగా వేగంగా గోదావరిలో పడవలు నడుపుతున్నారని భక్తులంటున్నారు.
అస్తికలు గోదావరిలో కలపడానికి 2000 రూపాయలు..
చనిపోయిన వారి అస్థికలను పుణ్యనదిలో కలపడానికి దూర, సుదూర ప్రాంతాల నుండి భక్తులు బాసరకు వస్తుంటారు. గోదావరి ఘాట్ వద్ద పిండ ప్రదాన పూజల అనంతరం గోదావరిలో నిమజ్జనం చేయడానికి ఒక్కొక్కరి వద్ద దాదాపు 2000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు నాటు పడవల నిర్వాహకులు. ఇందుకుగాను తమ సంఘం సభ్యులు సంవత్సరంలో కొన్ని రోజులు అస్థికలను కలపడానికి మాత్రమే సమయం కేటాయించుకుంటారు. ఒకరోజు దాదాపు 50 మంది తమ పూర్వీకుల అస్థికలను గోదావరిలో కలపడానికి బాసర వస్తుంటారు. దీన్ని బట్టి ఒక రోజు వారి కలెక్షన్ ఎంత మట్టుకు అవుతుందో ఎన్ని లక్షల సంపాదన భక్తుల వద్ద నుండి దోచుకుంటున్నారో అర్థమవుతుంది.
గోదావరి ఘాటుకు అడ్డంగా బోట్లు..
భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి గోదావరి చేరుకున్న తర్వాత ఇక్కడ స్నానం చేయడానికి గాడి వద్ద వెళ్తే అక్కడ అడ్డంగా బోట్లు ఉండడం చూసి ఎక్కడ స్నానం చేయాలో అర్థం కాక మొదటి ఘాట్ నుండి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలా అడ్డంగా బోర్డులను పెట్టవద్దని కలెక్టర్ మేడం స్వయంగా సూచించినా పట్టించుకున్న పాపాన పోలేదు బోటు నిర్వాహకులు. నాటుపడాల నిర్వాహకులకు కట్టడి చేసి తగిన విధంగా సూచనలు బోర్డులు ఏర్పాటు చేసి భక్తులను ఇక్కట్లకు గురి చేస్తే కంప్లైంట్ చేయడానికి నెంబర్ను కేటాయించవలసిందిగా భక్తులు కోరుతున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే బోటు సీజ్ చేయండి.. జిల్లా కలెక్టర్..
బాసర గోదావరి భక్తుల సేఫ్టీ విషయంలో రాజీపడిన, లైసెన్సు లేకుండా బోట్ నడిపి భక్తుల ప్రాణాలతో చెలగాటమాడి నిబంధనలను అధిగమిస్తే సంబంధిత బోట్లను సీజ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. శనివారం గోదావరి ఘాట్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ అభినవ అభినయ్ అక్కడే ఉన్న స్థానిక ఎమ్మార్వో పవన్ చంద్రకు సూచించారు.
సూచిక బోర్డు ఏర్పాటు చేసి వారికి తగిన సూచనలు ఇస్తాం.. బాసర ఎమ్మార్వో పవన్ చంద్ర..
భక్తుల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ మేడం సూచించిన విధంగా నాటు పడే వరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారికి తగిన సూచనలు ఇస్తాం, త్వరలో సూచికలతో కూడిన ఒక బోర్డును ఏర్పాటు చేసి నిబంధనలు అతిక్రమించిన వారి పై చర్యలు తీసుకొని బూట్లను సీజ్ చేస్తాం.