- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌కు చేదు అనుభవం
దిశ,ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన సుంకేట అన్వేష రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు ముందుగా సమయాన్ని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మీడియా సమావేశం ఉంటుందని ప్రకటించడంతో మీడియా ప్రతినిధులతో పాటు చైర్మన్ కలెక్టరేట్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. కానీ అప్పటికి సమావేశం మందిరం తాళాలే తీయలేదు. దీంతో సుమారు 45 నిమిషాల పాటు ఆయన తో పాటు మీడియా ప్రతినిధులు కూడా బయట నిరీక్షించాల్సి వచ్చింది.
చివరకు అన్వేష్ రెడ్డి స్వయంగా అధికారులతో మాట్లాడడంతో హుటాహుటిన అటెండర్ అక్కడికి చేరుకొని తాళాలు తీశారు. దీంతో మీడియా సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయ వర్గాలతో పాటు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే చైర్మన్ ఆదిలాబాద్ కు వస్తున్నట్టు ముందుగానే సమాచార శాఖ అధికారికి సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ ఆమె రాకపోవడంతో చైర్మన్ డీపీఆర్ఓ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చైర్మన్ మీడియా సమావేశం ఉందని ముందస్తుగా సమాచారం ఇచ్చిన ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై మండిపడ్డారు.