Collector Rajarshi Shah : లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి..

by Sumithra |
Collector Rajarshi Shah : లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి..
X

దిశ, ఆదిలాబాద్ : మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమం ద్వారా వివిధ యూనిట్ల స్థాపన కోసం పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వివక్షను ప్రదర్శిస్తూ పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే, సంబంధిత ఏపీఎంలను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మహిళా శక్తి కార్యక్రమం పై జిల్లా, మండల మహిళా సమాఖ్య ప్రతినిధులకు, డీపీఎంలు, ఏపీఎంలకు మైక్రో ఎంటర్ప్రైజెస్, మీ సేవా కేంద్రాలు, కుట్టు మిషన్ కేంద్రాలు పై ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా శక్తి కార్యక్రమం ఉద్దేశ్యాన్ని జిల్లా కలెక్టర్ వివరిస్తూ, మహిళలను ఆర్థికంగా మరింత ప్రగతిబాటలో పయనింపజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యార్థులు ఏకరూప దుస్తులను కుట్టి ఇచ్చే బాధ్యతలతో పాటు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో పనులను సైతం స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారానే కొనసాగిస్తోందని గుర్తు చేశారు.

జిల్లాలో మొత్తం టార్గెట్ 167 కుట్టు మిషన్ కేంద్రాలు కాగా ఐడెంటి ఫై చేసిన లబ్ధిదారులు 1050, యూనిట్ కేంద్రాలు 104 యూనిఫామ్స్ కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అందిస్తున్నామని, ఒక్క జత కుట్టుకూలీ 75 రూపాయలు చొప్పున మహిళా సంఘాలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. భవిష్యత్తులోనూ వీరికి అంగన్వాడీ సెంటర్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ లు కుట్టించే ఆర్డర్లు కూడా అందిస్తామని అన్నారు. రెండవ జత ఏకరూప దుస్తులను త్వరితగతిన అందించేలా చూడాలని మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.

మైక్రో ఎంటర్ప్రైజెస్ ద్వారా ఐడెంటి ఫై చేసిన లబ్ధిదారుల 3124, టార్గెట్ 3929, మీ సేవా కేంద్రాల యూనిట్ టార్గెట్ 19, ఐడెంటి ఫై 19. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలలో ఔత్సాహిక సభ్యులకు వారి అభిరుచికి అనుగుణంగా వివిధ యూనిట్ల స్థాపన కోసం ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని ఏపీఎంలను ఆదేశించారు. ఏపీఎంలు బ్యాంకు రుణాలు ఇప్పించడం, నాణ్యమైన ఉత్పాదకత, మార్కెటింగ్ వంటి వాటికి తోడ్పాటును అందించాలని అన్నారు. ఇందులో డీఆర్డీఓ సాయన్న, ఇందిరా మహిళా శక్తి సభ్యులు వనజ, ఏపీఎం, డీపీఎం, అన్ని మండలాల సమైఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story