- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పట్టవా..
దిశ, రామకృష్ణాపూర్ : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని సీఐటీయు ఎస్సీకేఎస్ ఏరియా అధ్యక్ష కార్యదర్శి రవి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఆర్కేపీ సీహెచ్పి గనిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కాంట్రాక్టు కార్మికులకు వరాల జల్లులు కురిపిస్తారని అనుకుంటే నిరాశే మిగిల్చారని మండిపడ్డారు.
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని అలాంటి కార్మికులను గనుల పై నిర్వహిస్తున్న దశాబ్ది సంబరాలల్లో యాజమాన్యం సవతి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వనికి సరైన బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, వెంకటేష్, రాజయ్య, మల్లయ్య, అంజయ్య, రామరాజు, బానయ్య, వనిత, గమ్లీ, ప్రేమలత, రూప, లక్ష్మి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.