'పుస్తకాల్లో దేశ నాయకుల చరిత్ర చదవండి.. చారవాణిలో కాదు..'

by Sumithra |
పుస్తకాల్లో దేశ నాయకుల చరిత్ర చదవండి.. చారవాణిలో కాదు..
X

దిశ, రాంనగర్ : సెల్ ఫోన్ కు బానిసలు కావద్దు పిల్లలు మీకే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. చరవాణిలో కాకుండా పుస్తకాల్లో దేశ నాయకుల చరిత్ర చదవండి అని సినీ నటులు అజయ్ ఘోష్ అన్నారు. బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర యువజన శాఖ వారి సహకారంతో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన షహిద్ భగత్ సింగ్ స్మారక యువజనోత్సవాలు ముగింపు సభ డ్రగ్స్ నిర్మూలన పై యువతకు అవగాహన కల్పించే నాటిక, దేశభక్తి గేయాలు ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్ మాట్లాడుతూ మహనీయుల పోరాటాలు మొత్తం పుస్తకాల్లో నిక్షిప్తం అయిందని.. చేతిలో ఉన్న బొచ్చ కాదన్నారు.

(సెల్ ఫోన్) ఒక వేళ చరవాణి ఉన్నా కొంతమంది ఎవరికి వారు చరిత్రను మార్చేస్తున్నానన్నారు. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండండి. రోజుకు ఒక మంచి పుస్తకం చదవండి అన్నారు. ఈ మట్టి కోసం దేశ ప్రజల కోసం ముగ్గురు గొప్ప నాయకులు ఉరి కంభం ఎక్కి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఆశయాలను బతికించుకుందాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు బాబ్జి, మాజీ జాతీయ వాలీబాల్ క్రీడాకారులు కిరణ్ రెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు జావేద్, అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed