- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుండెపోటుతో 108 పైలట్ మృతి..

దిశ, కౌడిపల్లి : కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 108 వాహనం పైలెట్ శ్రీనివాస్ (43) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాల నుంచి 108 వాహనం పైలట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.108 వాహనం పై ఎంతోమంది ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్ మృతి చెందడం పై తోటి సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.
అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. శనివారం ఇంటి వద్ద గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి శ్రీనివాస్ మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతునికి భార్య గాయత్రి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు.