HCU: మొన్న నాగ్‌అశ్విన్‌.. నేడు తరుణ్ భాస్కర్.. HCU 400 ఎకరాల భూముల వేలంపై గళం!

by Ramesh N |
HCU: మొన్న నాగ్‌అశ్విన్‌.. నేడు తరుణ్ భాస్కర్.. HCU 400 ఎకరాల భూముల వేలంపై గళం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU)కు చెందిన 400 ఎకరాల భూములను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తుందని వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భూములు విక్రయిస్తుందన్న వార్తలపై ప్రముఖ యువ దర్శకులు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. భూముల విక్రయానికి సంబంధించిన వార్తను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా ఇటీవల షేర్‌ చేసిన సినీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ‘మన ఖర్మ .. ఏమీ చేయలేం’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విక్రయానికి సంబంధించిన వార్తలపై మరో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) రేవంత్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూములు వేలం వార్తను షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తరుణ్ భాస్కర్ అసహనం వ్యక్తం చేశారు.

కాగా, ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రకృతిని కాపాడుకోవడానికి అందరూ ప్రముఖులు, కార్యకర్తలు, మేధావులు ముందుకు రావాలని నెటిజన్లు కోరుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను 'పార్కుల నగరం' అని పిలిచేవారని, నేడు మన హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి ఓ జేఏసీ అవసరమని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇక, ఈ విషయంపై ఇటీవల డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ప్రభుత్వం వేలం వేస్తున్న భూమి గ్రీన్‌ ఏరియా అని చెప్పారు. అక్కడ ఎన్నో ఐటీ పార్కుల ఉన్నాయి.. నాకు తెలిసి వాటిలో సగం వరకు ఖాళీగా ఉన్నాయి.. నిజంగా అభివృద్ధి చేయాలంటే టైర్‌-2 సిటీస్‌పై దృష్టి పెట్టొచ్చు.. అని చెప్పారు. కానీ 400 ఎకరాల్లో చెట్లు కొట్టకపోతేనే మంచిదనిపిస్తోందని మనసులో మాట చెప్పారు. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మొద్దనే డిమాండ్‌తో విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story