- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రోకెన్ బ్యాంగిల్స్ ...గొడ్డలి పై బ్లడ్ స్టెయిన్స్...

దిశ, సిటీక్రైం : 2018 సంవత్సరంలో వికారాబాద్ జిల్లా ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప సర్పంచ్ ని నలుగురు కలిసి వేటకొడవళ్లు, గొడ్డలితో ట్రాక్టర్ ను అడ్డం పెట్టి దారుణంగా హత్య చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది రాజకీయ, భూ వివాదాల కారణంగా హత్య చేశారని తేలింది. ఈ కేసులో అనుమానితులుగా నలుగురిని గుర్తించారు. ఈ హత్యతో ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాటు దాదాపు జిల్లా వ్యాప్తంగా ఓ సంచలన కేసు గా మారింది. ఈ కేసు దర్యాప్తు మొదటి దశలోనే హత్య చేసిన నిందితులకు శిక్ష పడాలి. శిక్ష పడక పోతే ఆ అనుమానితుల ఆగడాలు పెరిగిపోతాయి. శిక్ష పడితే మరో నేరం జరగకుండా నేరం చేయాలనే ఆలోచనను చంపేస్తుందనే లక్ష్యంగా ఈ కేసును దర్యాప్తు చేసిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ జాల ఉపేందర్ రావు ఆలోచన ఇది. అలా దర్యాప్తును ప్రారంభించి విచారణలో హత్య చేసిన నిందితులకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టు విచారణలో నిరూపించడంతో నలుగురికి జీవిత ఖైదు శిక్ష పడింది. విచారణ సందర్భంగా ప్రత్యక్ష సాక్ష్యులకు పూర్తి భరోసా, భద్రతను కల్పించి నిందితులకు శిక్ష పడేలా ఆరు సంవత్సరాలు డిఫెన్స్ వాదనలను తట్టుకుని ఒక ఆధారం మిస్ కాకుండా కృషి చేయడంతో ఆ కేసులో నేరస్థులకు శిక్ష పడింది.
బ్రోకెన్ బ్యాంగిల్స్---
2020 సంవత్సరంలో తాళ్ల కొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫోటో గ్రాఫర్ తన భార్యను గోడకేసి కొట్టి చంపాడు. పోలీసులకు, బంధువులకు అది ఆత్మహత్యగా చీత్రికరించి నమ్మించేందుకు ప్రయత్నించాడు. కేసు దర్యాప్తులో భాగంగా ఇన్స్ పెక్టర్ జాల ఉపేందర్ రావు స్వయంగా స్పాట్ విజిట్ చేసి అక్కడ విరిగిపోయిన గాజుల ఆధారంగా తీగ లాగితే గోడ మీద చెరిపేసిన రక్తపు మరుకలు స్పాట్ దొరికేలా చేసింది. ఆ నమూనాలను సైంటిఫిక్ గా సేకరించి ఆ ఆధారాలను కోర్టు విచారణలో నిరూపించడంతో భర్తకు జీవిత ఖైదు శిక్షను కోర్టు విధించింది.
ప్రచారం చేస్తే ఆచూకీ తో పాటు మిస్టరీ వీడింది---
2015 చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. దీంతో ఆ డెడ్ బాడీ ఫోటోను విస్తృతంగా ప్రచారం చేశాం. 21 రోజుల తర్వాత శంకర్ పల్లి సమీప గ్రామం మోమిన్ పేట్ కు చెందిన యువకుడిగా ఆచూకీ దొరికింది. అలా అతని స్నేహితులు, అతని ప్రవర్తన, మిస్సింగ్ అయిన తేదీ, అంతకు ముందు అతని వ్యవహారశైలి స్నేహితులు ఇలా ప్రతి విషయాన్ని విశ్లేషించుకుంటూ పోతే నలుగురు కలిసి ఆ యువకుడిని హత్య చేసినట్లు తేలింది. ఈ హత్య సెక్యువల్ జలేసీ కింద జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ కేసు దర్యాప్తులో ప్రతి ఆధారాన్ని భద్రపరచడం తో పాటు సాంకేతికంగా, శాస్త్రీయంగా అన్నింటిని క్రోడీకరించి అభియోగాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టు విచారణ ముందు నిరూపించడంతో ఐదు మందికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
2002 బ్యాచ్ కు చెందిన జాల ఉపేందర్ రావు తన 22 సంవత్సరాల పోలీసు కెరీర్ లో నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో హాఫ్ సెంచరీ దాటేశారు. ఇందులో ముఖ్యంగా 15 హత్య కేసులలో దాదాపు 20 మంది వరకు జీవిత ఖైదు శిక్షలు పడేలా దర్యాప్తు చేసి వాటిని కోర్టు విచారణలో నిరూపించి నిందితులను కటకట పాలు చేశారు. మిగతా కేసులలో కూడా ఏడాది, రెండేండ్లు, ఐదేండ్లు, ఏడేండ్లు, 10 ఏండ్లు శిక్ష పడే విధంగా చేసి చాలా మంది నేరస్థులను చట్టపరంగా బుద్ధి చెప్పారు. ఇలా నేరస్థులకు శిక్షలు ఖరారయ్యేలా దర్యాప్తు, విచారణను చేపట్టిందినందుకు జాల ఉపేందర్ కు ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తమ పోలీసు ఆఫీసర్ ప్రశంస పత్రాన్ని అందించారు. గత ఏడాది డీజీపీ జితేంద్ర , ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా 2024 లో 5 కేసులలో నిందితులకు జీవిత ఖైదు శిక్షలు ఖరారైయ్యేలా పని చేసినందుకు బెస్ట్ ఆఫీసర్ అవార్డును అందుకున్నారు.
ఇన్వెస్టిగేషన్ లో ప్రతి క్లూ ఇంపార్టెంట్...-
“కలవరం, కలకలం, సంచలనం రేపే ప్రతి క్రైం సంఘటనలో నేరస్థులకు శిక్ష పడాల్సిందే. ఈ దృష్టితో నే నా పోలీసు ఉద్యోగం ప్రారంభమైంది. నేరం చేసిన క్రిమినల్ తప్పించుకుంటే ఆ ప్రభావం సమాజం మీద తీవ్ర నష్టం చేకూరుస్తుంది. దీంతో వృత్తిలో 2002 లో ఎస్ఐగా చేరినప్పటి నుంచి ప్రతి కేసులో క్రైమ్ స్పాట్ విజిట్ చేయడం, ప్రతి క్లూను మిస్ కాకుండా సేకరించడం, సైంటిఫిక్ ఎవిడెన్స్ ల పై ఫోకస్ పెట్టడం, పోస్ట్ మార్టం జరిగే సందర్భంలో ఫోరెన్సిక్ డాక్టర్ లతో కలిసి ఉండడం.
విచారణ సమయంలో డిఫెన్స్ కు అవకాశం ఇవ్వకుండా నమోదు చేసిన అభియోగాల కు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించడం, సాక్ష్యులకు భరోసా కల్పించడం, రక్షణ అందించడం, వారికి కేసు వివరాలను బ్రీఫ్ చేయడం, విచారణ సందర్భంగా క్రైం ఇన్సిడెంట్ ను తిరిగి రివ్యూ చేయడం, ఇలా అన్నింటిని తిరిగి విశ్లేషించుకుని వాటిని న్యాయమూర్తి ముందు నిరూపించే విధంగా కేసు షెడ్యూలును పక్కాగా ప్లాన్ చేసుకోవడంతో ఇలా హత్య కేసులలో నిందితులకు జీవిత ఖైదీ శిక్షలు ఖరారయ్యేలా విజయం సాధించాను. మొత్తం ఇప్పటి వరకు నా సొంత కేసులలో దాదాపు 50 కేసులలో క్రిమినల్స్ కు వారి చేసిన నేరాలకు చట్టపరంగా శిక్షలు ఖరారయ్యేలా టీం వర్క్ తో సక్సెస్ అయ్యాను. ఇందులో దాదాపు 15 హత్య కేసులలో 20 మందికి పైగా నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. రిటైర్మెంట్ వరకు నేరం చేసిన వ్యక్తికి చట్టపరంగా శిక్ష పడాల్సిందే సిద్ధాంతాన్ని కొనసాగిస్తాను.”