Allu Arjun: అబుదాబిలోని నారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఐకాన్ స్టార్.. వీడియో వైరల్

by Kavitha |   ( Updated:2025-03-24 12:19:46.0  )
Allu Arjun: అబుదాబిలోని నారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఐకాన్ స్టార్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. అయితే విడుదలకు ముందు నుంచే ఈ మూవీ ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించి ఎన్నో రికార్డులను తిరగరాసింది.

ప్రస్తుతం బన్నీ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం. దీంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తోనూ బన్నీ ఓ మూవీ చేయాల్సి ఉంది. పీరియాడికల్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ రెండూ క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. దుబాయ్ లోని అబుదాబిలోని ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం (మార్చి 22) ఆలయానికి వెళ్లిన బన్నీ అక్కడి నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు అల్లు అర్జున్‌కు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం నారాయణ స్వామిని దర్శించుకున్న బన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు అల్లు అర్జున్‌కి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed