నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APPSC పరీక్షల తేదీలు ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2025-03-23 08:52:11.0  )
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APPSC పరీక్షల తేదీలు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ(APPSC) శుభవార్త చెప్పింది. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కాలేజీల్లో 464 లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. కాగా పాలిటెక్నిక్ కాలేజీల్లో 99, జూనియర్ కాలేజీల్లో 78 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష..

ఈ ఏడాది మే 3 నుంచి మే 9వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

జూనియర్‌ లెక్చరర్‌ పరీక్ష..

ఈ పరీక్షలను జూన్ 16 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ psc.ap.gov.in చేయండి.

టౌన్‌ ప్లానింగ్‌ సర్వీస్‌ పరీక్ష..

షెడ్యూల్‌ ప్రకటించబడింది. ఏప్రిల్ 28, 2025 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కంప్యూటర్‌ ప్రావీణ్య పరీక్ష:

ఏప్రిల్‌ 12, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరుగుతాయి.

ఇతర పోస్టుల కోసం పరీక్షలు:

అసిస్టెంట్‌ డైరెక్టర్, లైబ్రేరియన్, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ కెమిస్ట్‌ వంటి 8 పోస్టుల కోసం పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి ఏప్రిల్‌ 30, 2025 వరకు నిర్వహించబడతాయి. ఈ పరీక్షలు విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జరుగుతాయి.

Next Story