- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళ్లతో పరీక్ష రాశాడు.. అంగవైకల్యాన్ని జయించాడు..
by Sumithra |
X
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఓ విద్యార్థి రెండు చేతులు లేకున్నా పరీక్ష రాసి తన అంగవైకల్యాన్ని జయించాడు. శుక్రవారం బెల్లంపల్లి భవిత్ర డిగ్రీ కళాశాల డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్ష కేంద్రానికి రెండు చేతులు కోల్పోయిన ఏలూరు శంకర్ పరీక్ష రాయడానికి వచ్చాడు. సదరు విద్యార్థి ఓ ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు.
అయినప్పటికీ అధైర్య పడకుండా, నీరాశ పడకుండా తోటి విద్యార్థులతో కలిసి పరీక్ష రాయడానికి హాజరయ్యాడు. రెండు కాళ్ళతో పరీక్షరాసి తానేమి తక్కువ కాదని చాటి చెప్పాడు. పరీక్ష రాసిన విద్యార్థి నెన్నెల మండలం కుష్ణపల్లి గ్రామనివాసి. కాగా ఏలూరి శంకర్ గత పదిసంవత్సరాల క్రితం జరిగిన ఓ విద్యుత్తు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు.
Advertisement
Next Story