ఆదివాసీ మహిళపై లైంగికదాడి చేసిన వ్యక్తని కఠినంగా శిక్షించాలి

by Sridhar Babu |
ఆదివాసీ మహిళపై లైంగికదాడి చేసిన వ్యక్తని కఠినంగా శిక్షించాలి
X

దిశ, ఆసిఫాబాద్ : జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిపి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆదివాసుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేక పోతుందని విమర్శించారు. జైనూర్ ఏజెన్సీలో ఆదివాసులపై అనేక దాడులు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బాధితురాలికి సత్వర వైద్యం అందించడంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story