కలవర పెడుతున్న పులి

by Sridhar Babu |
కలవర పెడుతున్న పులి
X

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. గత మూడు రోజుల నుంచి ఆసిఫాబాద్ మండలంలో దానాపూర్, ఇప్పల్ నౌగాంతో పాటు బుధవారం దస్నపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి అడుగు జాడలతో అది వెళ్తున్న ప్రాంతాన్ని అధికారులు ట్రాకింగ్ చేస్తున్నారు. పులి సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పనులకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు.

Advertisement

Next Story