ప్రేమ పేరుతో మహిళ ఉద్యోగిని వేధించిన వ్యక్తిపై కేసు నమోదు..

by Sumithra |
ప్రేమ పేరుతో మహిళ ఉద్యోగిని వేధించిన వ్యక్తిపై కేసు నమోదు..
X

దిశ, గుడిహత్నూర్ : ప్రేమపేరుతో విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని వేధించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై.ఎల్.ప్రవీణ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన తిట్టే సుమిత్ అనేవ్యక్తి మండలంలోని తోషం గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిని గత కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడని తెలిపారు.

ఆదివారం ఆమె పనిచేస్తున్న వసతి గృహానికి వచ్చి వేధింపులకు గురి చేయడమే కాకుండా ప్రేమించకపోతే పురుగుల మందు తాగి చస్తానని ఎలుకల మందు తాగాడని తెలిపారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లి యువకుడిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. మహిళా ఉద్యోగిని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Next Story