దాబా (కే) లో 2 అగ్ని ప్రమాదం.. రూ. 80 వేలు నష్టం

by Sumithra |
దాబా (కే) లో 2 అగ్ని ప్రమాదం.. రూ. 80 వేలు నష్టం
X

దిశ, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని దాబా (కే) గ్రామంలో గురువారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం చేరుకునేలోపు గ్రామంలోని మస్కే రమేష్, ఉత్తం రైతులకు చెందిన పశువుల కొట్టాలు, ఎడ్ల బండ్లు, గ్రాసం, వ్యవసాయ పనిముట్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 80,000 వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖధికారి రామరాబ్ తెలిపారు. ప్రమాదం నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపించినట్లు ఆయన చెప్పారు.

Advertisement

Next Story