- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS తెచ్చిన ప్రతి పథకంలో కేసీఆర్ ఏ-1 ముద్దాయి: అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ప్రతి పథకంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రథమ ముద్దాయిగా ఉన్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. గురువారం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవర్ కమిషన్‌పై.. మేము దొంగతనం చేస్తాం కానీ మమ్మల్ని ఎవరు అడగొద్దు అనేలా బీఆర్ఎస్ వాదన ఉందని ఎద్దేవా చేశారు. ఏ కమిషన్ వేసినా కమిషన్‌ను ప్రశ్నించడం, ఎదురు దాడి చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. విద్యుత్ కమిషన్ విషయంలో హై కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుందామని సూచించారు. ఏ కమిషన్ వేసినా దానికి సమాధానం చెబుతామని బీఆర్ఎస్ నేతలు అన్నరు.. అలాంటప్పుడు ఎందుకు హైకోర్టును ఆశ్రయిస్తున్నరని ప్రశ్నించారు. మీ నాయకుడిని హౌస్‌కి రమ్మంటే రాడుని.. ఆయన వస్తే ప్రతి అంశం సభలోనే చర్చిస్తామని అన్నారు.
బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదని సెటైర్ వేశారు. రైతు రుణమాఫీని రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి సర్కార్ చేసిందని అన్నారు. ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయారన్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు అజెండా ఏందో ఫిక్స్ చేసుకోండని బీఆర్ఎస్‌కు చురకలంటించారు. ఫ్రీ బస్ బాగోలేదని.. ఆటో వాళ్ళను ఎగేస్తున్నారని మండిపడ్డారు. ఫ్రీ బస్సు ఉండదని అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పథకాల్లోల ఏమైనా లోపాలు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండన్నారు. ప్రతి అంశంపైన కేసీఆర్ పేరు చర్చకు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలని అన్నారు. కమిషన్లను తప్పుపట్టడం, విచారణ తప్పుపట్టడం బీఆర్ఎస్ మానుకోవాలని హితవు పలికారు. జాబ్ కేలండర్‌ను ప్రిపేర్ చేస్తున్నాం.. ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసే వాళ్ళ ట్రాప్‌లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. సామాన్యుడు చెబితే కూడా కాంగ్రెస్ వింటది.. ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్లు భ్రమ పడకండి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన ఇచ్చిన అన్ని గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.