Actress Kasturi : తెలుగు ప్రజలకు క్షమాపణలు తెలిపిన నటి కస్తూరి

by M.Rajitha |   ( Updated:2024-11-05 14:22:05.0  )
Actress Kasturi : తెలుగు ప్రజలకు క్షమాపణలు తెలిపిన నటి కస్తూరి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి కస్తూరి (Kannada Actress kasturi) ఎట్టకేలకు తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 'తెలుగువారు తమిళ రాజుల వద్ద సేవలు చేయడానికి వచ్చి, ఇప్పుడు మేము తమిళులం అంటూ మాట్లాడుతున్నారని' ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కస్తూరి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలతోపాటు, అటు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపాయి. దక్షిణాదికి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కస్తూరి వ్యాఖ్యలను తప్పు పట్టారు. దీంతో దిగి వచ్చిన నటి తెలుగు వారికి క్షమాపణలు తెలిపింది. 'మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నా వ్యాఖ్యలు మీ మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను మాట్లాడిన మాటలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను' అని నటి కస్తూరి పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed