Rave Party : రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నారు.. తేల్చేసిన బెంగళూరు కమిషనర్

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-21 09:36:09.0  )
Rave Party : రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నారు.. తేల్చేసిన  బెంగళూరు కమిషనర్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇచ్చారు. ‘సన్ సెట్ టు సన్ రైస్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ పార్టీ కోసం పెద్ద మొత్తం ఈ ఫీజు వసూలు చేశారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఎవరూ ఈ పార్టీలో పాల్గొనలేదని ఆయన తెలిపారు. అయితే సినీ నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఓ వీడియో విడుదల చేసి తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని తన ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ వీడియోపై సైతం పోలీసులు ఫోకస్ పెట్టారు. నిన్న విడుదల చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు.

Read More..

Rave Party : రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. ఆ ఇద్దరు సినీనటులు ఎవరు?

Advertisement

Next Story