వారిపై చర్యలు తీసుకోవాల్సిందే.. సీఈసీకి రేవంత్ రెడ్డి కంప్లైంట్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-25 17:04:13.0  )
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ​కేడర్‌కు చెందిన ఆఫీసర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డీజీపీ అంజనీకుమార్, స్టీఫెన్ రవీంద్రతో పాటు రిటైర్డ్ ఆఫీసర్లు వేణుగోపాల్ రావు,నర్సింగ రావు, భుజంగరావు, జగన్మోహన్ రావులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణలోని కొంతమంది అధికారులను బీఆర్ఎస్ పార్టీ తన సొంత పార్టీ నాయకులుగా వినియోగించుకుంటుందన్నారు.దీని వలన ఎన్నికల పారదర్శకత లోపిస్తుందన్నారు.

మరోవైపు సిట్,ఇంటెలిజెన్స్‌లను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల‌పై నిఘా పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్, స్మిత సబర్వాల్, రాజశేఖర్ వీళ్లంతా బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారన్నారు. దీంతో పాటు పలు డిపార్టమెంట్లలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులను కూడా మార్చాలని కోరామన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు సొంత టీవీ ఛానెల్స్, పేపర్స్‌లో బీఆర్ఎస్ కార్యక్రమాలు మాత్రమే చూపిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను చూపించడం లేదన్నారు. అలాంటి మీడియాపై చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed