తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ

by Mahesh |   ( Updated:2024-08-14 12:52:07.0  )
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ మాజీ నేత, కేకే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో ఈ రోజు తెలంగాణ సహా పలు రాష్ట్రాల రాజ్యసభ సభ్యుల ఉపఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ రాజ్యసభ స్థానం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. ఈ ఉత్కంఠకు తెర దించుతూ.. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీని పంపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించి ఏఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అభిషేక్ మను సింఘ్వీ 2006 నుంచి రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.

కాగా ఈ రాజ్యసభ ఉప ఎన్నిక‌ల‌కు ఈ రోజు (ఆగ‌స్టు 14న) నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 21 వరకు నామినేష‌న్ల వేయడానికి చివ‌రి తేదీ. మ‌హారాష్ట్ర, అస్సాం, మ‌ధ్యప్రదేశ్‌, మ‌హారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల‌కు చెందిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు, బీహార్, ఒడిశా, హ‌ర్యానా, రాజ‌స్థాన్ తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన అభ్యర్థులు 27వ తేదీలోపు నామినేష‌న్లను ఉప‌సంహ‌రించుకునేందుకు వీలు కల్పించింది. అలాగు సెప్టెంబ‌ర్ 3 ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు 9 రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్ల లెక్కించనున్నారు.

Advertisement

Next Story