తెలంగాణలో కీలక పరిణామం.. ఎన్నికలు రాకముందే ఆ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం

by Gantepaka Srikanth |
తెలంగాణలో కీలక పరిణామం.. ఎన్నికలు రాకముందే ఆ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పదేళ్ల తర్వాత పవర్‌లోకి వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని సీట్లన్నీ గెలవాలని లక్ష్యం పెట్టుకున్నది. ఇందుకోసం సమర్ధవంతమైన వ్యక్తులను ఎంపిక చేసి గెలిపించాలని భావిస్తున్నది. దీనిలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు కోసం పార్టీ సర్వే నిర్వహించనున్నది. కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. వచ్చే అసెంబ్లీలో సత్తా చాటాలంటే ముందు స్థానికంగా పట్టు సాధించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే టిక్కెట్ల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నది. గ్రామాల వారీగా సర్వే చేయించి ఖరారుచేయనున్నారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల నరాగా మోగకముందే ఓ గ్రామ సర్పంచ్ ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండా సర్పంచ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గ్రామంలో మూడు ఆలయాలు, బొడ్రాయి పండుగ వేళ ఇంటికి రూ.1000 ఇస్తానని దరావత్ బాలాజీ అనే వ్యక్తి ప్రతిపాదించారు. అందుకు సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయొద్దని షరతు విధించారు. దీనికి గ్రామస్తులు అంగీకరించడంతో పాటు అతడితో అగ్రిమెంట్ రాయించుకున్నారు. అనంతరం సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తూ గ్రామంలో విజయోత్సవ ర్యాలీ తీశారు.

Advertisement

Next Story

Most Viewed