గూగుల్ పే వాడే వారికి బిగ్ అలర్ట్.. కొత్త మోసానికి తెరలేపిన సైబర్ క్రిమినల్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-14 14:46:48.0  )
గూగుల్ పే వాడే వారికి బిగ్ అలర్ట్.. కొత్త మోసానికి తెరలేపిన సైబర్ క్రిమినల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాలు(Cyber ​​fraud) ప్రజలను భయపెడుతున్నాయి. కాల్స్ చేయడం, ఫోన్‌లు చేయడం వంటి వాటికి పాల్పడుతూ మోసాలు చేస్తున్నారు. తాజాగా మరో మోసానికి తెరలేపారు. ‘ఈ మధ్యే ప్రారంభమైన ఒక కొత్త తరహా మోసమిది. పొరపాటున గూగుల్ పే(Google Pay)కి కొంత డబ్బు వచ్చిందంటూ అమౌంట్ నంబర్‌తో కూడిన మెసేజ్ పంపిస్తారు. మనం ఆ మెసేజ్‌లో ఉన్న అమౌంట్ నంబర్ చూసి ఆ డబ్బు నిజంగా వచ్చిందేమో అనుకొని తిరిగి పంపిస్తుంటాం. అలా చేయడంతో సైబర్ క్రిమినల్స్ అప్రమత్తమై అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం కాజేస్తారు’ అందుకే ఫోన్‌లకు వచ్చే మెసేజుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story