- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ ‘నోటు’కు సరికొత్త కోడ్ వర్డ్!
దిశ, రాచకొండ : ఎన్నికల వేళ పైసలు (కరెన్సీ నోట్)కు సరి కొత్త పేరు ‘విటమిన్ - ఎమ్’ తెరపైకి వచ్చింది. ఎమ్ అంటే మనీ.. కాగా కార్యకర్తలు, నాయకులకు అభ్యర్థుల వెంట తిరిగాలంటే విటమిన్ - ఎమ్ తప్పనిసరిగా మారింది. విటమిన్ -ఎమ్ ఉంటేనే జోష్, ఎనర్జీ వస్తుందని అందరిలో చర్చ. విటమిన్ - ఎమ్ లేకుంటే రాజకీయ నాయకులు వెంట తిరగడం వేస్ట్ అని కార్యకర్తలో టాక్. మరో వైపు ఎన్నికల ముందు రోజు కొన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు విటమిన్ - ఎమ్ తప్పని సరిగా మారిన సందర్భాలు గత కొన్ని ఎన్నికల నుంచి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ విటమిన్ - ఎమ్ డంపులపై అందరీ నజర్ ఉంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులు ఒకరిని పట్టించేందుకు మరొకరు వారి కార్యకర్తలను గుడాచారులుగా రంగంలోకి దింపారు. ఇక పోలీసులు కూడా విటమిన్ -ఎమ్ డంపుల కోసం నిఘాను పెంచారు. దీని ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు విటమిన్- ఎమ్ డంపులపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. విటమిన్ - ఎమ్ డంపుల(కరెన్సీ నోట్లు )సమాచారం ఉంటే డయల్ 100 అంటున్నారు పోలీసు బాసులు.