HYD: మాదాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

by GSrikanth |
HYD: మాదాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్‌లో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

Next Story