GO 46 Case: సుప్రీం కోర్టులో జీవో 46 కేసు కీలక మలుపు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు

by Ramesh N |
GO 46 Case: సుప్రీం కోర్టులో జీవో 46 కేసు కీలక మలుపు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన GO 46 పై వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో కీలక మలుపు తిరిగింది. సోమవారం సుప్రీంకోర్టులో GO 46పై విచారణ జరిగింది. GO 46పై తమ వైఖరి, పోస్ట్‌ల భర్తీ విషయంలో అవలంబించిన విధానంపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 27 కు వాయిదా వేసింది. కేసు తేలే దాక భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న 900 పోస్ట్‌ల భర్తీ ఆపాలని బాధితుల తరుపు లాయర్ ఆదిత్య సొంది వాదించారు. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణ వరకు వేచి చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బాధితుల తరపున వాదించిన బృందం లో సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ఆదిత్య సొంది, జీ విద్యాసాగర్, మిథున్ శశాంక్‌లు ఉన్నారు. బాధితుల పక్షాన విచారణకు (BRS) బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరయ్యారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి పరిస్థితులకు అనుగుణంగా జీవో 46 ను తీసుకొచ్చింది. అయితే దీని వలన చాలా మంది అర్హులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని పోలీసు ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. జీవో 46 ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌నుత తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో భాదితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

Next Story

Most Viewed