సికింద్రాబాద్ లో కూలిన భారీ వృక్షం.. తప్పిన ప్రాణ నష్టం

by M.Rajitha |
సికింద్రాబాద్ లో కూలిన భారీ వృక్షం.. తప్పిన ప్రాణ నష్టం
X

దిశ,వెబ్ డెస్క్ : గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు సికింద్రాబాద్ పరిధిలో ఓ భారీ వృక్షం కూలి పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అడ్డగుట్టలో రహదారి పక్కనే ఉన్న ఓ పురాతన భారీ వృక్షం అకస్మాత్తుగా కూలి.. చెట్టు కింద నుండి వెళ్తున్న కార్లు, ఆటోలపై పడింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని బయటికి తీసుకు వచ్చారు. చిన్న గాయాలు మినహా ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్డుపై అడ్డంగా పడిపోయిన వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Next Story

Most Viewed