పంటపొలాల్లో కుప్పకూలిన భారీ బెలూన్

by Rajesh |
పంటపొలాల్లో కుప్పకూలిన భారీ బెలూన్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: వాతావరణ వివరాల సేకరణ కోసం ప్రయోగించిన బెలూన్ కల్వకుర్తి మండలం తర్నీకల్ గ్రామంలో కూలిపోయింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భారత పరిశోధన సంస్థ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ వాతావరణ వివరాలు తెలుసుకునేందుకు ఈ నెల 17‌న దాదాపు 800 కిలోల బరువున్న ప్లాస్టిక్ బెలూన్‌ను అంతరిక్షంలోకి పంపింది.

కాగా, సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో అది కల్వకుర్తి మండలం తర్నీకల్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశోధనా సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed