- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన ఆవిష్కరణల కోసం మంత్రి కేటీఆర్ విజన్ అద్భుతం : ఎన్నారైల బృందం
దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ దేశాల నుండి వచ్చిన ప్రవాస తెలంగాణ సంస్థల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం తో కలిసి టీ-హబ్, టీ - వర్క్స్ సందర్శించారు. వినూత్న ఆవిష్కరణలతో వచ్చిన స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన టీ-హబ్, టీ - వర్క్స్ దేశానికే గర్వకారమని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్ ఎంతో అద్భుతమని ప్రశంసించారు.
ఎన్నారై బీఆర్ఎస్ , తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) & ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (అటై) నాయకులు, ప్రతినిధులలు టీ హబ్‌ను, టీ వర్క్స్ ను సందర్శించారు. భారతదేశంలో ఆంత్రప్రెన్యూర్‌షిప్ (వ్యవస్థాపకత), ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడమే లక్షంగా, యుువత తాము వినూత్న ఆలోచనలను ఆవిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్, టీ - వర్క్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఎంతోమంది ఔత్సాహిక యువత పారిశ్రామికవేత్తలుగా మారేందుకు సిద్ధమవుతున్నారని, వారందరికీ టీ-హబ్, టీ వర్క్స్ ఒక చక్కని వేదికల్లా ఉపయోగపడుతోందన్నారు.
ఉత్సాహం ఉన్నవారిని ప్రోత్సహించి, వారి సంస్థలు విజయవంతం అయ్యేందుకు తోడ్పడుతోందని తెలిపారు. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. ఈ మార్పుకి నాయకత్వం వహించిన మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు పరిశోధన, సేవల అభివృద్ధి, ఆవిష్కరణలను హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకున్నాయన్నారు. స్టార్ట్‌పలకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రోత్సాహం అందిస్తోందని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్‌లో భారత్‌లో అడుగుపెట్టే ప్రతి సంస్థ ముందుగా తెలంగాణ రాష్ట్రాన్నే ఎంచుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తల్లి తండ్రులు , స్కూల్, కాలేజ్ యాజమాన్యం పిల్లల్ని టీ-హబ్, టీ - వర్క్స్ సందర్శనకు తీసుకెళ్లాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఆలోచనలకు ఊతం ఇచ్చేలా టీ-హబ్, టీ - వర్క్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. స్టార్టప్‌లు సాఫీగా కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుకూల వాతావరణం టీ-హబ్‌లో ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అరవింద్ రెడ్డి, హరిగౌడ్ నవపేట్, సుప్రజ పులుసు, జాహ్నవి దూసరి, రవి ప్రదీప్ పులుసు, జెల్లా శ్రీకాంత్, అనిల్ బైరెడ్డి, మార్తినేని గూడెం సర్పంచ్ రాము బండమీది, తిరుమందాస్ నరేష్, రాజేష్ శమకురా, రాజు గౌడ్, వినయ్ గౌడ్ బత్తిని తదితరులు పాల్గొన్నారు.