- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డ్రగ్స్ డే సందర్భంగా యువతకు అదిరిపోయే కాంటెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ డ్రగ్స్ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టారు. డ్రగ్స్, అక్రమ రవాణాపై యువతలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ‘డ్రగ్స్ అండ్ ఇట్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’ పేరుతో కాంటెస్ట్ ను నిర్వహించనున్నారు. ఇందులో 3 నిమిషాల వ్యవధితో ఉండే షార్ట్ వీడియో చేయాలి. వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలపై మాదకద్రవ్యాల ప్రభావాలను హైలైట్ చేస్తూ వీడియోలు తీయాలని పేర్కొన్నారు. దీని కోసం 18 ఏళ్ల వయస్సు పైబడిన వారు పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ పోటీలో గెలిచిన మొదటి ముగ్గురికి రూ. 75, 000, రూ. 50, 000, రూ. 30,000 ప్రైజ్ మనీ అందజేస్తారు.
దీని కోసం జూన్ 20 వరకు గడువు ఇచ్చారు. అంతేకాకుండా సాంగ్, పోయమ్(కవిత్వం), పోస్టర్ కాంటెస్ట్‌ను కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారి వయస్సు 15 ఏళ్లు పైబడి ఉండాలని వెల్లడించారు. సాంగ్/పోయమ్ కాంటెస్ట్ లో గెలిచిన మొదటి ముగ్గురు విజేతలకు రూ. 10, 000, రూ. 7,000, రూ. 5,000 ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. చివరి తేదీ జూన్ 15గా పేర్కొన్నారు. పోస్టర్ కాంటెస్ట్ లో గెలిచిన మొదటి ముగ్గురు విజేతలకు రూ. 5,000, రూ. 3,000, రూ. 2,000 బహుమతిగా ఇవ్వనున్నారు. పోటీకి చివరి తేదీ జూన్ 15గా పేర్కొన్నారు. పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు +91 96523 94751 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. లేదా, HTTPS://WDSC.TELANGANA.GOV.In/InDEX.PHP వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
@hydcitypolice @TelanganaDGP pic.twitter.com/JdBtK04jIc
— RameshVaitla (@RameshVaitla) May 27, 2023