- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొరాయించిన ఆర్మీ వాహనం
దిశ, వైరా : సీఆర్‌ఎఫ్ బలగాలతో ప్రయాణిస్తున్న సీఐఎస్ఎఫ్‌కు చెందిన మైన్ ప్రూఫ్ వజ్ర వాహనం వైరాలో మొరాయించింది. ఈ వాహనానికి డీజిల్ లీకేజీ సమస్య రావడంతో జాతీయ ప్రధాన రహదారి పక్కన నిలిపివేశారు. చత్తీస్‌గఢ్‌లోని జబల్పూర్ నుంచి సిఆర్ఎఫ్ బలగాలు మైన్ ప్రూఫ్ వజ్ర వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. కొత్తగూడెం జిల్లా లిమిట్స్ వరకు అక్కడ పోలీస్ శాఖ అధికారులు ఈ వాహనానికి ఎస్కార్ట్ కల్పించారు. ఖమ్మం జిల్లా సరిహద్దు నుంచి ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ అధికారులు ఈ వాహనానికి ముందు ఎస్కార్ట్‌గా ఉన్నారు.
అయితే ఈ వాహనం వైరాలోని పాత బస్టాండ్ సమీపంలో ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే రోడ్డు వద్ద జాతీయ ప్రధాన రహదారిపై డిజిల్ లీకేజి సమస్యతో మొరాయించింది. దీంతో ఈ వజ్రా వాహనాన్ని జాతీయ రహదారి పక్కన పార్కు చేశారు. అయితే సిఆర్ఎఫ్ బలగాలు వాహనం కోసం జాతీయ రహదారిపై తుపాకులతో ఉండటంతో స్థానికుల్లో అలజడి మొదలైంది. సిఆర్ఎఫ్ బలగాలు వైరాకు ఎందుకు వచ్చాయని స్థానికులు ఆందోళన చెందారు. అనంతరం ఆ వాహనం మోరాయించిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసు అధికారుల సహకారంతో మైన్ ప్రూఫ్ వజ్రా వాహనానికి మరమ్మత్తులు చేస్తున్నారు.