పోలీస్ స్టేషన్ లో 8అడుగుల కొండ చిలువ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-19 08:26:55.0  )
పోలీస్ స్టేషన్ లో 8అడుగుల కొండ చిలువ
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ భారీ కొండచిలువ పోలీస్ స్టేషన్ ఆవరణలో హల్ చల్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో 8అడుగుల భారీ కొండచిలువ సంచారం పోలీసులతో పాటు స్థానికులను హడలెత్తించింది. స్టేషన్ ఆవరణ నుంచి అక్కడి కాలువ నీటీలో గుండా వెలుతోంది. కొండచిలువను గమనించిన పోలీసులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కాలువలో నుండి పోతున్న కొండ చిలువను చాక చక్యంగా పట్టుకున్నాడు. కొండ చిలువకు ఎటువంటి గాయాలు కాకుండా జాగ్రత్త వహించి అటవీ శాఖకి అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కొండచిలువను బంధించి తరలించడంతో పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న నివాసితులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed