- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడెవడండీ బాబూ..పెట్రోల్ బంక్ దగ్గర ఆర్మీ ఫ్లెక్సీలు
దిశ, అచ్చంపేట : ఓ పంచాయతీ కార్యదర్శి అచ్చంపేట పట్టణంలో పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. యజమాని గతంలో ఆర్మీలో విధులు నిర్వహించేవారు. దీంతో తన ఫొటోలను పెట్రోల్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉంచడం చట్ట విరుద్ధమంటూ అచ్చంపేట పట్టణానికి చెందిన కాజా సయ్యద్దుద్దీన్ జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్, అచ్చంపేట మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ వారు పోలే శ్రీనివాసులు తెలకపల్లి మండలం నెల్లికుదురు గ్రామ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి సునీత పేరున అచ్చంపేట పట్టణంలో ఆయిల్ కంపెనీ వారు మంజూరు చేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద మిల్ట్రీ ఫిల్లింగ్ స్టేషన్ అని వ్యాపారం నిర్వహించడం తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ 1964 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాజా సయ్యద్దుద్దీన్ అధికారులకు ఫిర్యాదు చేసిన పత్రంలో పేర్కొన్నాడు. భారత చట్టం ప్రకారం 20 (1)ఏ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి తమ విధుల సమయంలో ఏదైనా వ్యాపారం ఇతర వ్యాపారాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని ఆ చట్టం తెలుపుతుందన్నారు. సదరు పంచాయతీ కార్యదర్శి పోలే శ్రీనివాసులు బిల్లింగ్ స్టేషన్ ముందు ఆర్మీ డ్రస్సులో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం.. జాతీయ సాయుధ బలగాలను అవమానపరిచేలా ఉందని, తెలంగాణ పౌర సేవల కండక్టర్ రూల్స్ 1964 ను ఉల్లంఘించినందుకు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశాడు.
కార్యదర్శి పోలె శ్రీనివాసులు వివరణ..
ఈ వివాదంపై పెట్రోల్ బంక్ యజమాని, పంచాయతీ కార్యదర్శి పోలే శ్రీనివాసులు స్పందించి దిశకు వివరణ ఇచ్చారు. దేశ సైనికుల పట్ల గౌరవంతో ఆర్మీ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశానన్నారు. తెలియక జరిగిందని తెలిపారు. అలాగే తను కార్యదర్శిగా విధులకు ప్రతిరోజు హాజరవుతున్నానని వివరణ ఇచ్చాడు. డ్యూటీ అనంతరం సెలవు దినాలలో నా సొంత పనులు చూసుకుంటున్నానని, కావాలని ఆ వ్యక్తి తనపై కంప్లీట్ చేశాడని ఆయన ఆరోపించారు.