- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అరుదైన పురస్కారం
దిశ, మక్తల్: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి సేవా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ పురస్కారాని అందుకున్నారు. శనివారం తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరిలోనీ కంబన్ కళారై ఆరాగం వేదికగా..గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వర్చ్యువల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరి వారిచే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కి గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందించారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజలకు సేవలు అందిస్తూనే..అనేక సామాజిక, సహాయక కార్యక్రమాలు చేపట్టాడు. ప్రమాదాలలో గాయపడిన వారిని స్వయంగా చేతులతో వాహనంలో ఎక్కించుకొని ఆసుపత్రులకు తీసుకువెళ్లి..సొంత ఖర్చులతో వైద్యం చేయించడం లాంటి సేవా కార్యక్రమాలతో గౌరవ డాక్టరేట్ పురస్కారం ఇస్తారు. పాండిచ్చేరిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలుగులో ప్రసంగించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. తన జీవిత కాలంలో చివరి అంకం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడతానన్నారు. తన సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు డాక్టరేట్ ను అందించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం అందుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు.