Phone Tapping : కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్‌లో ఎప్పుడు జైలుకు వెళ్లేది తెలియదు : మంత్రి కోమటిరెడ్డి

by Ramesh N |   ( Updated:2024-10-19 10:04:08.0  )
Phone Tapping : కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్‌లో ఎప్పుడు జైలుకు వెళ్లేది తెలియదు : మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేము రైతు కుటుంబంలో పట్టి కష్టపడి నేను, రేవంత్ రెడ్డి కష్టపడి పైకొచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌లాగా రెడిమేడ్ గా అమెరికా నుండి వచ్చాడని, తెలంగాణ ఉద్యమం టైమ్‌లో వచ్చి రెండు సార్లు అరెస్ట్ అయ్యి.. కేసీఆర్ కొడుకంటే గుర్తుపడతారు.. కేటీఆర్ ఎవరికీ తెల్వదు అని తీవ్ర విమర్శలు చేశారు. జుమ్లా మోడీ, హౌలా సీఎం అని అంటావా.. నీకసలు కొంచెమైనా సభ్యత ఉందా? అని ప్రశ్నించారు. కేటీఆర్ ఏమైనా ప్రజా నాయకుడా..? సోంతగా ఎదిగిన నేతనా? ఉద్యమాలు చేశాడా? అని ఫైర్ అయ్యారు. పదేళ్లలో వందల దేశాలు తిరిగి వేల కోట్లు సంపాధించారని ఆరోపించారు. అన్ని దేశాలు తిరిగి ఏమీ సాధించావని ప్రశ్నించారు. ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చినవా? టీహబ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తప్ప కేటీఆర్ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లాంటివి కట్టామని ఎన్నో ఎంఎన్‌సీ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పడ్డాయని వివరించారు.

నల్గొండలో ఫ్లోరైడ్ పెరిగింది

రీసెంట్ నివేదిక ప్రకారం నల్గొండలో ఫ్లోరైడ్ పెరిగిందని మంత్రి అన్నారు. ఫ్లోరైడ్ రూపుమాపామని కేసీఆర్, కొడుకు, అల్లుడు చెప్పుతుంటరని విమర్శించారు. మిషన్ భగీరథ కింద రూ. 6 వేల కోట్లు ఖర్చు పెట్టినమని, అందులో వాళ్లు రూ. 5 వేల కోట్లు దోచుకున్నరని ఆరోపించారు. అరేయ్ కేటీఆర్.. నల్గొండ ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు కాదురా.. అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. హరీశ్ రావు నాటకాల రాయుడు, పొద్దున లేస్తే పిచ్చి పట్టినట్లు మొరుగుతున్నాడని విమర్శించారు. ఎవరో చెబితే వినే రక్తం మా నల్గొండోళ్లది కాదన్నారు. అదేవిధంగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో ఎప్పుడు జైలుకు వెళ్లేది తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story