మిరపకాయ బజ్జీలు, బోండాలు తిని 60 మందికి అస్వస్థత

by Javid Pasha |
మిరపకాయ బజ్జీలు, బోండాలు తిని 60 మందికి అస్వస్థత
X

దిశ, తాండూర్ : కుమురం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది మిరపకాయ బజ్జీలు, బోండాలు తిని శుక్రవారం రాత్రి అస్వస్థకు గురయ్యారు. తిర్యాని మండల కేంద్రంలో శుక్రవారం వార సంత జరిగింది. ఈ సంతకు వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు తమ పిల్లలతో కలిసి వచ్చారు. సంతలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి మిర్చి బండి వద్ద బోండాలు, బజ్జీలు తిని వారి స్వగ్రామాలకు వెళ్లారు. బొండాలు, మిరపకాయ బజ్జీలు తిన్న వారికి అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలు అయి అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి చికిత్స కోసం మండల కేంద్రంలోనికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైద్య, ఆరోగ్య సిబ్బంది స్పందించి అస్వస్థకు గురైన వారికి వైద్యం చేస్తున్నారు. డాక్టర్ హర్ష మాట్లాడుతూ.. సంతలో మిరపకాయ బజ్జీలు, బోండాలు తిన్న దాదాపు 60 మంది వరకు వాంతులు విరేచనాలు అయ్యాయని, వారికి సరైన చికిత్స అందిస్తున్నమన్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రజలు కలుషితమైన ఆహారాన్ని తీసుకోకుండా తగు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.

Advertisement

Next Story