AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలివే!

by Shiva |
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై ఇటీవల సీఎం (CM)కు పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ క్రమంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-1982 (Land Grabbing Act-1982) రిపీల్ బిల్లు ప్రతిపాదలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం ఉన్న చట్టంలో భూ ఆక్రమణదారులపై కేసుల నమోదుకు అవాంతరాలు ఎదురవుతుండటంతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-1982 (Land Grabbing Act-1982) చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ (Law &Order)‌ను మరింత పటిష్టం చేసే ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. అందుకు అనుబంధంగా ఇచ్చిన జీవో నెం.77‌ను కేబినెట్ రద్దు చేయనుంది.

Next Story

Most Viewed