ఆ రెండు సినిమాలు ఒక రేంజ్‌లో ఉంటాయి.. మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్(వీడియో)

by Kavitha |   ( Updated:2025-04-26 04:15:15.0  )
ఆ రెండు సినిమాలు ఒక రేంజ్‌లో ఉంటాయి.. మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ షోరూమ్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. మీడియాతో ముచ్చటించింది. అక్కడ తాను చేస్తున్న ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. మీనాక్షి మాట్లాడుతూ.. ‘ప్రజెంట్ నేను రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి నాగ చైతన్య(Naga Chaitanya) గారితో, మరొకటి నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) గారితో చేస్తున్నాను. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ టు ప్రాజెక్ట్స్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దీనికి నేను చాలా హ్యాపీ.. హోప్ ఫుల్లీ ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ ఈ మూవీస్ రిలీజ్ అవుతాయి. అయితే డెఫినెట్‌గా ఆడియన్స్‌కు ఈ సినిమాలు నచ్చుతాయని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Next Story

Most Viewed