టెన్త్ బాలిక‌పై లైంగిక‌దాడి జ‌ర‌గ‌లేదు: తిరుప‌తి ఎస్పీ క్లారిటీ

by srinivas |
టెన్త్ బాలిక‌పై లైంగిక‌దాడి జ‌ర‌గ‌లేదు: తిరుప‌తి ఎస్పీ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా యర్రవారిపాళెం మండలం యల్లమందలో జరిగిన ఘటనపై ఎస్పీ సుబ్బరాయుడు(SP Subbarayadu) వివరణ ఇచ్చారు. బాలికపై లైంగిక దాడి(Sexual Assault) జరిగినట్లు టెస్ట్‌ల్లోనూ నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. బాలిక‌పై కేవలం దాడి మాత్రమే జరిగిందని, లైంగిక‌దాడి జ‌ర‌గ‌లేదని తెలిపారు. మైనర్ కావడంతో మొదట విచారణ చేయడానికి పీహెచ్‌సీకి తీసుకెళ్లారని పేర్కొన్నారు. సోమవారం రాత్రి తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రి(Tirupati Maternity Hospital)లో నిర్వహించిన టెస్టుల్లో బాలిక లైంగిక‌దాడికి గురైన‌ట్టు నిర్ధార‌ణ కాలేదన్నారు. కానీ లైంగిక‌దాడి జ‌రిగింద‌ని కొన్ని మీడియా సంస్థలు, కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ప్రచారం చేశారని చెప్పారు. దాడి చేసిన నిందితులు తన అదుపులో ఉన్నారని, విచారిస్తున్నామని తిరుప‌తి ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed