- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి: RSP డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా బీసీలను అన్యాయం చేస్తున్నాయని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. పెరిగిన జనాభాకానుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. గురువారం అయన బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 52 శాతం ఉన్న బీసీలకు 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా 27 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారని తెలిపారు. అగ్రవర్ణాల పేదలు 8 శాతం ఉంటే ఈడబ్లూఎస్ కోటలో పది శాతం రిజర్వేషన్ ఇస్తే బీసీలకు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎన్నో పోరాటాలు జరుగుతున్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పట్టించుకోవడంలేదని విమర్శలు చేశారు. బీసీలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే జనాభా దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తమిళనాడు, జార్ఖండ్ ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్ పెంచారాని తెలిపారు.
కేంద్రం వెంటనే బీసీల కులగణన చేయాలని, ఎందుకు కులగణన చేయడంలో జాప్యం చేస్తుందో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. పెరిగిన జనాభాకానుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కచ్చితంగా కోటా అమలు చేయాలన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. బీసీ క్రిమిలేయర్ విధానం ఎత్తివేయాలని కేంద్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ పెంచాలని నవంబర్ 26 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిరసనలు, అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్రామ గ్రామాన రచ్చబండ కార్యక్రమం నిర్వహించి చైతన్యం తీసుకువస్తామన్నారు. కోటి మందితో సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి అందిస్తారని, అంతేకాకుండా హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.