- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGSRTC : ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపడుతాం: యువతకు పొన్నం గుడ్ న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం ఆర్టీసీ కళాభవన్‌లో సంస్థ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి పురస్కారాలు ప్రధానోత్సవం జరిగింది. ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి ప్రభాకర్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. టీజీఎస్ ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపడతామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. నూతన ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ముందస్తుగా దృష్టిలో పెట్టుకొని బస్సులు, రెండోసారి నియామకాలు చేపడుతున్నామన్నారు.
259 వ రోజుకి 81 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, రూ. 2750 కోట్ల విలువైన ప్రయాణాన్ని అక్కాచెల్లెళ్లకు అందించామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగి మరణిస్తే రూ. కోటి బీమా ఇచ్చేలా బ్యాంక్‌తో ఎంవోయూ చేశామని వెల్లడించారు. ఆర్టీసీలో బాండ్స్ రూ.80 కోట్ల పెమెంట్స్ జరిగాయని, రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. దానికి నిధులు తీసుకొచ్చి.. చెల్లించే బాధ్యత రేవంత్ సర్కార్‌దని హామీ ఇచ్చారు.