30 వేల ఎకరాల అసైన్డ్ భూములు గుంజుకున్నరు : R. S. Praveen Kumar

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-31 09:08:39.0  )
30 వేల ఎకరాల అసైన్డ్ భూములు గుంజుకున్నరు : R. S. Praveen Kumar
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుని ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ, అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుంటుందన్నారని ఆరోపించారు.

బహుజన వాదిననే ముసుగులో కేసీఆర్ దళితులను పదేళ్ల నుంచి నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బహుజనవాదం బలపడడంతో కేసీఆర్ కుట్రలతో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ను నార్త్ ఇండియా నుంచి అరువుకు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. గతంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను తీసుకువచ్చి, దళితులకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

పేదల అసైండ్ భూముల్లో స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు కడుతున్న ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, కవిత ఫామ్ హౌస్ లలో డంపింగ్ యార్డ్ లు, స్మశాన వాటికలు కడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. పేద రైతుల దగ్గర భూములను గుంజుకుని బడా బాబులకు, కేసీఆర్ బినామీలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

ఎన్నో ఏళ్ల నుంచి అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు చాలా రాష్ట్రాలు రెగ్యులరైజ్ చేసి, పట్టాలు ఇస్తున్నా తెలంగాణలో మాత్రం అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయడంలేదన్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా బీఆర్ఎస్ పార్టీల ఆఫీస్ లకు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన అసైన్డ్ భూముల పై విచారణ జరిపిస్తామన్నారు.అసైన్డ్ భూముల బలవంతపు అక్రమణలపై త్వరలోనే హైకోర్టులో పిల్ వేస్తామన్నారు. భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన ప్రాంతాలకు ప్రభుత్వం వంద కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read More : పోటీ విషయంలో ‘నో’ క్లారిటీ.. కన్ఫ్యూజన్‌లో కమ్యూనిస్టులు!

Advertisement

Next Story

Most Viewed