- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
AP Assembly Session: 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నేడు (ఈ రోజు) 3 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగా.. ఉదయం 9 గంటలకు క్వచ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఆ తర్వత అసెంబ్లీలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఏపీ పంచాయితీ రాజ్ బిల్లు-2024 ప్రవేశ పెట్టనున్నారు. ఆ తర్వాత మంత్రి నారాయణ ఏపీ మున్సిపల్ బిల్లు- 2024 బిల్లును, మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగానే ప్రశ్నోత్తరాల సెషన్ కూడా నిర్వహించి.. చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధికుక్కల బెడద.. గ్రామ-వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రోరైల్ నిర్మాణం, ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, డీఎస్సీ-1998 అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఆ తర్వాత 2024 -25 ఆర్థిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.
ఇదిలా ఉంటే శాసన మండలి కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ప్రశ్నోత్తరాల సెషన్‌తో ప్రారంభం కానున్న ఈ సెషన్‌లో.. ఫ్రీ హోల్డ్ భూములు క్రమబద్దీకరణ, కైకలూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులు, 2019 – 24 వరకు మద్యం అమ్మకాలలో జరిగిన అక్రమాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పంట రుణాలపై అధిక వడ్డీ, విజయనగరంలో ఆతిసారం, పీడీఎస్ బియ్యం అక్రమాలు, ఉచితపంటల భీమా పథకం, పంచాయితీ భవనాలకు రంగులు, పాఠశాల బస్సులకు పన్ను అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం 2024 – 25 ఆర్ధిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.