12 ఎకరాల ధాన్యం భగీరథ పాలు..

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-01 15:59:56.0  )
12 ఎకరాల ధాన్యం భగీరథ పాలు..
X

దిశ, ఖానాపూర్: ఆరుగాలం కష్టపడి రైతులు కుప్ప చేసిన ధాన్యం రాశిని మిషన్ భగీరథ తన్నుకుపోయింది. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయి ధాన్యం కొట్టుకుపోయిన సంఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని కింది బస్టాండ్ సెంటర్‌లో ఇండ్ల ముందు ఆరబోసిన వరి ధాన్యం మిషన్ భగీరథ నీటిలో కొట్టుకుపోయింది. సుమారు 12 ఎకరాల వడ్లు కొట్టుకుపోయినట్టు రైతులు చెబుతున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో రోడ్డుపై గురువారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. కాగా రైతులకి జరిగిన నష్టం ప్రభుత్వం పరిహారం ఇస్తుందా దీనిలో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్య ధోరణి ఉందా, కాకతాళీయంగా జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed