- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం వాసులకు గుడ్‌న్యూస్
దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం వాసులకు తెలంగాణ పర్యాటక శాఖ శుభవార్త తెలిపింది. వరంగల్‌లోని లక్నవరం చెరువు, సిద్దిపేటలోని కోమటిచెరువుకు ధీటుగా లకారం ట్యాంక్‌బండ్ నందు తీగల వంతెనకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే రూ.8 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగానే రూ. 2 కోట్లతో డ్యాన్సింగ్ ఫౌంటేన్, లైట్ కమ్ షో ఫౌంటెన్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. రేపు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నిర్మాణాలు పూర్తియితే లకారంకు మరింత శోభ సంతరించుకోనుందని ఖమ్మం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నగరంలోని నూతన బస్టాండ్ పక్కన రూ.10కోట్లతో అధునాతన సౌకర్యాలతో బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్, విలాసవంతమైన గదులతో నిర్మించనున్న హరిత టూరిజం హోటల్‌కు కూడా మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.