- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ పేరుతో రాష్ట్రంలో 75 వారాలు జరిగే కార్యక్రమం ఇదే..!
దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో రాష్ట్రంలో 75 వారాల పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్నందున ఈ నెల 12వ తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలను వచ్చే ఏడాది పంద్రాగస్టు వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి అధ్యక్షతన ప్రత్యేక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. 75 వారాల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని 75 చోట్ల జాతీయ పతాకాలను ఎగురవేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సమీపంలోని సంజీవయ్య పార్కులో ఎత్తయిన జాతీయ పతాకం తరహాలోనే ఈ 75 ప్రాంతాల్లో జెండాలను ఎగురవేస్తారు. ఈ వేడుకల కోసం ప్రభుత్వం రూ.25 కోట్లను విడుదల చేస్తున్నట్లు సోమవారం సీఎం ఒక ప్రకటనలో తెలిపారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం ప్రత్యేకమైన పాత్ర పోషించిందని, ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రంగా స్వయం పాలనలో అభివృద్ధి చెందుతూ దేశ అభ్యుదయంలో ఉజ్వలమైన భాగస్వామిగా ఉన్నదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ గురించి వివరించి అన్ని రాష్ట్రాల్లో 75 వారాల పాటు వేడుకలను నిర్వహించి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిందిగా సూచించారని, అందులో భాగంగా వివిధ శాఖల అధికారులతో ప్రగతి భవన్‌లో సోమవారం చర్చించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమ విధి విధానాలను ఈ సమావేశంలో చర్చించి ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. రమణాచారి నేతృత్వంలోని ఉత్సవ కమిటీలో సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, సాంస్కృతిక వ్యవసారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, పంచాయతీ రాజ్ కమిషనర్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన నగరంలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రితోపాటు వరంగల్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమానికి గవర్నర్ హాజరుకానున్నట్లు తెలిపారు.
ఆ రోజు ఉదయం 11 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు మార్చ్ నిర్వహిస్తారని, గాలిలోకి బెలూన్లు వదలనున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని దేశభక్తి కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. పండుగ వాతావరణంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని, స్వాతంత్ర్య సమరయోధులను, అమరవీరులను స్మరించుకుని జోహార్లు అర్పించాలని సూచించారు. 75 వారాల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నందున వివిధ స్థాయిల్లో వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలను, కవి సమ్మేళనాలను నిర్వహించి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయాలని ఆదేశించారు.