ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థి మృతి

by Sumithra |   ( Updated:2020-09-21 04:29:35.0  )
Telangana Student
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థి చనిపోయాడు. ఎంఎస్ చదివేందుకు వెళ్లిన వికారాబాద్ వాసి శివ శంకర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో ఇవాళ తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఆస్ట్రేలియా సదరన్ క్రాస్ యూనివర్శిటీలో చదువుతున్న శివ శంకర్ ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. బాత్‌ రూమ్‌కు వెళ్లి కింద పడిపోవడంతో ఫ్రెండ్స్ వెంటనే ఆస్పత్రికి తరలించగా… అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ధరూర్ మండలం హరిదాస్‌పల్లికి చెందిన సాయిరెడ్డి, నాగేంద్రమ్మల ఒక్కగానొక్క కుమారుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. తమ కొడుకు చనిపోయాడన్న వార్త విని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story